సుష్మా నీటి సాగు పథకంతో పంటలు పండిస్తే నీరు, ఎరువు ఆదా అవ్వడంతో పాటు, కలుపు, కూలీ సమస్య వుoడదని, దిగుబడి గణనీయంగా వుoటుందని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గుంటూరు కృషి భవన్ వద్ద డ్రిప్, స్ప్రీంకర్లు రైతులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో 23 వేల హెక్టార్లు లక్ష్యంగా 2010 మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా స్ప్రీంకర్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.