భూసమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వ రీసర్వే చేపట్టిందని జిల్లా జాయింట్ కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. పేరేచర్లలోని సాయికృష్ణ ఫంక్షన్ హాల్లో వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్షణ పై మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల గ్రామ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. తొలత డ్రోన్ సర్వేను పరిశీలించారు.