నరసరావుపేట లింగంగుంట్ల లోని -1 గ్రామ సచివాలయం పరిధిలో ఇటీవల మృతి చెందిన వేమవరపు శ్రీనివాసరావు భార్యకు మంగళవారం వైయస్సార్ బీమా నగదును అందజేశారు. సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రూ 10 వేల నగదును శ్రీనివాసరావు భార్య లక్ష్మీ తిరుపతమ్మకు అందించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి కె. వి. ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ శ్రీనివాసరావు సాధారణ మరణం చెందడం ద్వారా వైయస్సార్ భీమా ద్వారా రూ. లక్ష మంజూరైనట్లు తెలిపారు.