మాచర్ల: వెల్దుర్తి మండలంలోని గొట్టిపాళ్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని లడ్డును వేలంపాటలో మంగళవారం 50వేల రూపాయలకు గ్రామ సర్పంచ్ రామాంజి దక్కించుకున్నారు. మరో లడ్డును ఎడ్లపల్లి స్వామి 25వేల రూపాయలకు కైవసం చేసుకున్నారు. గ్రామంలో బ్రహ్మంగారి గుడి వద్ద ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జనం సందర్భంగా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు అనంతరం కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.