సంతకవిటి మండలం లోని నారాయణపురం ఆనకట్ట పై కుడి ఎడమ ప్రధాన కాలువలే రైతులకు ప్రధాన ఆధారం. ఆనకట్ట పై ఉన్న షట్టర్ల వ్యవస్థ అధికారులు గాలికి వదిలేశారు. లైకా నిధులతో అభివృద్ధి పనులకు రాజకీయ గ్రహణం పట్టడంతో మూడేళ్లుగా నారాయణపురం ఆనకట్ట అభివృద్ధికి నోచుకోలేదు. నారాయణపురం ఆనకట్ట పై 118 షట్టర్స్ ఉన్నాయి. ఈ షట్టర్లు నదిలో వచ్చే సాగు నీటిని కుడి ఎడమ ప్రధాన కాలువలకు మళ్ళించేందుకు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. 118 షట్టర్లు లో 70 శాతానికి పైగా శిథిలావస్థకు చేరి అస్తవ్యస్తంగా ఉన్నాయి. కుడి ఎడమ ప్రధాన కాలువ పరిధిలో 50వేల ఎకరాలకు సాగునీరు అందించాలి. అయితే ఈ ఏడాది షటర్ల వ్యవస్థ అధ్వాన్నంగా ఉండటం వల్ల సాగునీరు ఎలా అందుతుందని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడేళ్లుగా అధికారులు గాలికి వదిలేయడం పై పలువురు రైతులు విమర్శిస్తున్నారు.