ఆసియా కప్‌లో భారత్‌కు బుధవారం మ్యాచ్ లేదు. కానీ భారతీయ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోయారు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోవాలని ప్రార్థిస్తూ ఈ మ్యాచ్‌ను వీక్షించనున్నారు. ఒకరకంగా ఈ మ్యాచ్ తో ఆసియాకప్ ఫైనల్ బెర్త్ ఖాయం అవుతుంది. పాక్ గెలిస్తే ఆ జట్టు ఫైనల్ చేరుతుంది. భారత్‌తో పాటు ఆఫ్ఘనిస్థాన్ కూడా ఇంటిదారి పడతాయి. అప్పుడు భారత్, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లకు ప్రాధాన్యం ఉండదు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ గెలిస్తే భారత్ ఆశలు సజీవంగా ఉండడంతో పాటు ఫైనల్ రేసు రసవత్తరంగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోతే శ్రీలంకతో జరిగే చివరి మ్యాచ్ అవుతుంది. ఆ మ్యాచ్‌లో కూడా పాకిస్థాన్ ఓడిపోయి, ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్ ఓడిపోతే ఆ జట్టు ఫైనల్ చేరేందుకు నెట్ రన్ రేట్ కీలకం. రెండు వరుస విజయాలతో శ్రీలంక ఇప్పటికే దాదాపు ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. అప్పటికీ భారత్‌పై గెలిచిన పాకిస్థాన్.. రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడిస్తే ఎలాంటి డ్రామా లేకుండా ఫైనల్‌కు చేరుకుంటుంది.