ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో 57 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్సార్ చేయూత, దివ్యాంగులకు 4 శాతం ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు, భావనపాడు పోర్టు విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.