మహారాష్ట్రలోని అంబర్‌నాథ్‌లో దారుణ ఘటన జరిగింది. వృశాలి కులకర్ణి అనే మహిళ ఇటీవల పూజ చేసుకోసాగింది. ఆ సమయంలో ఆమె కోడలు విజయ కులకర్ణి సౌండ్ ఎక్కువ పెట్టి టీవీ చూస్తోంది. టీవీ ఆపాలని కోడలికి చెబితే ఆమె సౌండ్ ఇంకా పెంచింది. దీంతో వృశాలి టీవీ ఆపేసింది. పట్టరాని కోపంతో విజయ తన అత్తగారి చేతివేళ్లను విరిచేసింది. అడ్డొచ్చిన తన భర్త సౌరభ్‌ను కూడా కొట్టింది. విజయపై వృశాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.