ఢిల్లీ లిక్కర్ స్కాం పై ఎంపీ రఘురామకృష్ణ రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. లిక్కర్ స్కామ్ లో రోహిత్ రెడ్డి, పినాక శరత్ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి అల్లుడు ముగ్గురూ సూత్రధారులు, పాత్రధారులని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆరోపించారు. వీళ్ళే భారీ పెట్టుబడితో అడాన్ డిస్టిలరీస్ ప్రారంభించారని చెప్పారు. డిస్టలరీలు చంద్రబాబు ఇచ్చినవైతే అన్నా క్యాంటిన్లులా ఎందుకు మూసివేయలేదని ప్రశ్నించారు. ఢిల్లీ కుంభకోణం ఈ రోజు కాకపోయినా రేపైనా బయటపడుతుందని చెప్పారు.