నెల్లూరు జిల్లాలో సంచలనం రేపిన బాలికపై దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం సేవించి బాలిక ఇంటికి వెళ్ళిన మేనమామ నాగరాజు గిన్నెలో యాసిడ్ పోసుకుని చెవి పోగులు ఇవ్వాలని బాలికను బెదిరించినట్లు జిల్లా ఎస్పీ CH విజయరావు చెప్పారు. పాప భయపడి ఒక పోగు ఇచ్చి రెండోది తీసేలోగా యాసిడ్ దాడి చేయడంతోపాటు చాకుతో గాయపరిచారని పోలీసులు వివరించారు.