కృష్ణా జిల్లా నేతలపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 14 నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ ఇన్చార్జీలతో బుధవారం మధ్యాహ్నం చంద్రబాబు అత్యవసర భేటీ అయ్యారు. ఈ భేటీలో చెన్నుపాటి గాంధీ పై జరిగిన ఘటనపై స్పందించకపోవడం పట్ల ఆగ్రహం చేసినట్లు సమాచారం.