వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకోవడం కాంగ్రెస్ కు ఎంతో కీలకం. ఈ క్రమంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ జోడో యాత్ర మరికాసేపట్లోనే ప్రారంభం కానుంది. బుధవారం సాయంత్రం 5 గంటలకు కన్యాకుమారిలో ప్రారంభం కానున్న ఈ యాత్ర దాదాపుగా 150 రోజుల పాటు 3,570 కిలోమీటర్ల మేర సాగి కశ్మీర్ చేరుకుంటుంది.
ఇంతటి భారీ యాత్రను పకడ్బందీగా కొనసాగించేందుకు కాంగ్రెస్ పార్టీ ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. భారత్ యాత్రిక్ పేరిట 118 మందితో ఆ పార్టీ ఈ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు దక్కగా... ఏపీ నుంచి మాత్రం ఒక్కరికే అవకాశం దక్కింది. ఈ బృందం పాదయాత్ర ఆద్యంతం రాహుల్ వెన్నంటే సాగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa