ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్లపై యాక్టివా రాజ్యం.. 50 లక్షల సేల్స్‌తో రికార్డు

Technology |  Suryaa Desk  | Published : Thu, Feb 26, 2026, 08:44 PM

Honda Motorcycle & Scooter Indiaకు చెందిన Honda Activaకు భారత మార్కెట్లో భారీ ఆదరణ లభిస్తోంది. దేశవ్యాప్తంగా స్థిరమైన విక్రయాలతో దూసుకెళ్తున్న ఈ స్కూటర్.. ఒక్క మహారాష్ట్ర రాష్ట్రంలోనే 50 లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకుంది.గత 25 సంవత్సరాల్లో మహారాష్ట్రలో మాత్రమే 50 లక్షల యాక్టివాలు విక్రయమైనట్లు కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా పూణే, ముంబై, థానే, నాగ్‌పూర్, నవీ ముంబై వంటి నగరాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇది ఆ రాష్ట్రంలో యాక్టివాకు ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
*హోండా యాక్టివా మోడల్స్‌ : ప్రస్తుతం మార్కెట్లో యాక్టివా రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది — యాక్టివా 6జీ (110సీసీ) మరియు యాక్టివా 125 (125సీసీ). యాక్టివా 6జీ ఎక్స్‌-షోరూమ్ ధర సుమారు రూ.81,000 నుంచి రూ.95,500 వరకు ఉంది. ఇక యాక్టివా 125 ధరలు సుమారు రూ.91,000 నుంచి రూ.96,000 మధ్య ఉన్నాయి.ఇంజిన్ పనితీరుపై దృష్టి సారిస్తే.. యాక్టివా 6జీ 109.51 సీసీ ఇంజిన్‌తో 7.8 పీఎస్ శక్తి, 8.8 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే యాక్టివా 125లో 123.92 సీసీ ఇంజిన్ ఉండి 9.5 పీఎస్ పవర్, 11.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa