ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమర్శలకు చెక్‌ పెట్టిన అభిషేక్‌ శర్మ.. సుడిగాలి అర్ధశతకం

sports |  Suryaa Desk  | Published : Thu, Feb 26, 2026, 08:32 PM

టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఎట్టకేలకు ఫామ్‌ అందుకున్నాడు. జింబాబ్వేతో జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో ఈ ఎడమచేతి బ్యాటర్‌ దుమ్మురేపాడు. కేవలం 26 బంతుల్లోనే అర్ధశతకం సాధించి తన ప్రతిభను చాటిచెప్పాడు.టీ20 ప్రపంచకప్‌-2026లో అభిషేక్‌ ప్రారంభం నుంచే తీవ్ర నిరాశ కలిగించిన విషయం తెలిసిందే. లీగ్‌ దశలో అమెరికాతో మ్యాచ్‌లో గోల్డెన్‌డక్‌గా వెనుదిరిగిన అతడు.. అనంతరం కడుపునొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు.తర్వాత జట్టులోకి తిరిగి వచ్చినప్పటికీ పరిస్థితి మారలేదు. పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లోనూ డకౌట్‌గా నిలిచాడు. అయినా జట్టు యాజమాన్యం అతడిపై విశ్వాసం కోల్పోలేదు. సూపర్‌-8 దశలో సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 12 బంతుల్లో 15 పరుగులు చేసి మరోసారి నిరాశపరిచాడు.దీంతో అభిషేక్‌ శర్మ ఫామ్‌పై విమర్శలు గట్టిగా వినిపించాయి. తుదిజట్టులో నుంచి తప్పించి కొంత విశ్రాంతి ఇవ్వాలన్న సూచనలు మాజీ క్రికెటర్ల నుంచి వచ్చాయి. అయితే, మేనేజ్‌మెంట్‌ మాత్రం అతడిపై నమ్మకం ఉంచింది. ఆ విశ్వాసానికి తగ్గట్టే జింబాబ్వేతో మ్యాచ్‌లో అభిషేక్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో సమాధానం ఇచ్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa