ట్రెండింగ్
Epaper    English    தமிழ்

London Fashion Week వేదికపై పూజా హెగ్డే స్టైల్ స్టేట్‌మెంట్

international |  Suryaa Desk  | Published : Thu, Feb 26, 2026, 09:34 PM

గ్లామర్‌, ఎలిగెన్స్ కలిసిన ఆ అద్భుత క్షణాల గురించి మరింతగా తెలుసుకుందాం. ఆమె తెరపై కనిపిస్తే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షమే. Allu Arjun సరసన ‘బుట్టబొమ్మ’గా అలరించినా, N. T. Rama Rao Jr. పక్కన ‘అరవింద’గా హుందాతనాన్ని చూపించినా ఆ పాత్రలకు న్యాయం చేసింది.ముంబైలో జన్మించి, టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి, ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై తన ముద్ర వేస్తోంది. తాజాగా London Fashion Week షో క్లోజింగ్ సెరిమనీలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది Pooja Hegde.ప్రఖ్యాత డిజైనర్ ఖుషీ కుమార్ రూపొందించిన డిజైనర్ ఔట్‌ఫిట్‌ను ప్రదర్శిస్తూ పూజా రన్‌వేను మెరిపించింది. గాఢమైన మెరూన్ షేడులో హాల్టర్-నెక్ స్టైల్ గౌను ధరించి వేదికపై అడుగుపెట్టిన ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. గౌను పైభాగంలో బంగారు దారంతో చేసిన పూల ఎంబ్రాయిడరీ రాజసాన్ని అద్దగా, సాటిన్ ఫ్యాబ్రిక్ ఆమె లుక్‌ను మరింత ఎలివేట్ చేసింది. ఆత్మవిశ్వాసంతో నడిచిన ప్రతి అడుగు గ్లోబల్ గ్లామర్‌కు ప్రతీకగా నిలిచింది.ఈ ప్రత్యేక క్షణాలను పూజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. “లండన్ ఫ్యాషన్ వీక్‌లో షోను క్లోజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఏదైనా తొలిసారి చేయడం ఎప్పుడూ ప్రత్యేకమే. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో ప్రయాణాలు చేయాలని ఆశిస్తున్నాను” అంటూ భావోద్వేగపూరితంగా రాసింది. వేవీ హెయిర్‌ను ఫ్రీగా వదిలేసి, సింపుల్ మేకప్‌తో ఆమె లుక్ మరింత ఆకర్షణీయంగా నిలిచింది.2010 మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో సెకండ్ రన్నరప్‌గా నిలిచిన పూజా, ‘ముగామూడి’ చిత్రంతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. అనంతరం ‘ఒక లైలా కోసం’, ‘దువ్వాడ జగన్నాథమ్’, ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘మహర్షి’ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా ఎదిగింది. Ala Vaikunthapurramuloo ఆమె కెరీర్‌కు భారీ మలుపు తిప్పింది. బాలీవుడ్‌లో కూడా హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి గుర్తింపు సంపాదించింది.ప్రస్తుతం పూజా చేతిలో పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఉన్నాయి. 2026లో విజయ్ సరసన ‘జన నాయకన్’, వరుణ్ ధావన్‌తో ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ చిత్రాల ద్వారా ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa