ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా ఘన విజయం

sports |  Suryaa Desk  | Published : Thu, Feb 26, 2026, 06:52 PM

T20 WC: సూపర్-8 పోరులో వెస్టిండీస్‌పై 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. WI నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 16.1 ఓవర్లోనే అలవోకగా ఛేదించింది. కెప్టెన్ మార్క్రమ్ 82*, డికాక్ 47, రికెల్టన్ 45* పరుగులతో రాణించారు. WI బౌలర్ ఛేజ్ ఒక వికెట్ తీశారు. విండీస్ పై సౌతాఫ్రికా గెలుపుతో టీం ఇండియా సెమీస్ అవకాశాలు మరింత పెరిగాయి.సఫారీ బ్యాటర్లను ఔట్ చేయడానికి విండీస్ బౌలర్లు తీవ్రంగా చెమటోడ్చారు. రోస్టన్ ఛేజ్ మాత్రమే వికెట్ పడగొట్టగలిగాడు. మిగతా బౌలర్లంతా ధాటిగా పరుగులు సమర్పించుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగుల చేసింది. షెఫర్డ్(52*) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. హోల్డర్(49) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సఫారీ బౌలర్లలో ఎంగిడి 3, రబాడా, బోష్ తలో 2 వికెట్లు పడగొట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa