ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీకి లేఖ రాసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

national |  Suryaa Desk  | Published : Wed, Sep 07, 2022, 09:35 PM

దేశంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పీఎం శ్రీ ప‌థ‌కాన్ని ప్రకటించారు. దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం స్పందించారు. ఈ పథకం అమలుకు సంబంధించి ప్రధానికి లేఖ రాశారు. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ రంగంలో 10 లక్షల పాఠశాలలు ఉన్నాయని ఆ లేఖలో కేజ్రీవాల్ తెలిపారు. ప్రధాని మోదీ ప్రకటించిన పథకం ద్వారా ఐదేళ్లలో 14,500 పాఠశాలలు అభివృద్ధి చెందితే... మిగిలిన ప్రభుత్వ పాఠశాలలు అలా మారడానికి వందేళ్లకు పైగా సమయం పడుతుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశంలోని 14 వేల పాఠశాలలకు బదులు 10 లక్షల పాఠశాలలను ఈ పథకం కింద ఎంపిక చేయాలని ప్రధానిని కోరారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com