కృష్ణా జిల్లా శాఖ నేతలతో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇటీవల విజయవాడకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై జరిగిన దాడి నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.ఈ కీలక సమావేశానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు హజారయ్యారు. ఈ సమావేశంలో భాగంగా కృష్ణా జిల్లా నేతల తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కీలక నేత చెన్నుపాటి గాంధీపై దాడి జరిగినప్పుడు సొంత జిల్లాకు చెందిన నేతలు స్పందించలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని నాయకులంతా సంయుక్తంగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.