కంబదూరు మండలంలో 3. 5 గిగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రి ఉషాశ్రీచరణ్ తెలిపారు. అమరావతి నుంచి బుధవారం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం దక్కిందన్నారు. ముఖ్యంగా అత్యంత వెనుకబడిన ప్రాంతమైన కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరులో రెన్యువబుల్ ఎనర్జీ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతులు దక్కడంపై హర్షం వెలిబుచ్చారు.