యూరప్ దేశాల తీరుపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా స్పందించారు. యూరప్ కు వెళ్లే సహజ వాయువుల పైప్ లైన్ ను కెమెన్ నిలిపివేసిందంటూ ఆరోపించడంపై మండిపడ్డారు. 'రష్యా ఎనర్జీని ఆయుధంగా ఉపయోగిస్తోందని వాళ్లు అంటున్నారు. నాన్సెన్స్.. అది ఆయుధమా?. మేమేం ఆంక్షలను విధించే వాళ్లం కాదు. అవసరంలో ఉన్నవాళ్లకు సాయం అందించే రకం' అంటూ పరోక్షంగా అమెరికాకు చురకలు అంటించారు.