GPS పెన్షన్ వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు అనేక ప్రయోజనాలున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేసారు. విజయవాడలో ఉద్యోగ సంఘాలతో GPS పై భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. GPS ఫైనల్ డ్రాఫ్ట్ ను ఉద్యోగులకు వివరించామన్నారు. ఉద్యోగులతో మరోసారి చర్చలు జరుపుతామని, GPS ఫైనల్ అయ్యాక చట్టబద్ధత కల్పిస్తామన్నారు.