ఏపీ సర్కార్ క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలోని క్రీడాకారులు జగనన్న స్పోర్ట్స్ యాప్ లో తమ సమాచారాన్ని రిజిస్టర్ చేసుకోవాలని క్రీడాశాఖ మంత్రి RK రోజా కోరారు. నేడు సచివాలయంలో శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి తో కలిసి ఆమె ఈ యాప్ ఆరంభించారు. యాప్ ద్వారా క్రీడాకారులు వారి సమాచారాన్ని అందిస్తే ఆ వివరాలు క్రీడాశాఖకు చేరడం సులభతరం అవుతుందని రోజా అన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.