ద్రాక్ష రసంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిద్రలేమితో బాధపడేవారు రాత్రిపూట ఒక కప్పు ద్రాక్ష పండ్లను తింటే మంచిది. ద్రాక్ష పళ్లను మెత్తగా చేసి, అందులో పంచదార కలిపి తింటే కడుపు మంట తగ్గుతుంది. మీకు తలనొప్పిగా ఉన్నప్పుడు, ఒక గ్లాసు ద్రాక్ష రసం తాగడం వల్ల తలనొప్పి నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఎండు ద్రాక్ష తొక్కలను పాలలో కలిపి తీసుకుంటే పొట్ట సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.