ఏపీలో మంత్రుల పనితీరుపై సీఎం జగన్ కు నివేదిక చేరింది. ముగ్గురికి పైగా మంత్రులపై వేటు పడే ఛాన్సుందని సమాచారం. నవంబర్ లో ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. వేటు పడే మంత్రుల్లో ఒక మహిళా మంత్రి కూడా ఉన్నట్లు సమాచారం. బుధవారం కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు సీఎం జగన్ స్పష్టమైన హెచ్చరిక చేశారు. ప్రతిపక్షాల విమర్శలను ఖండించని, పనితీరు సరిగా లేని మంత్రులపై వేటు వేసే ఛాన్సుంది.