లోన్ యాప్ ఆగడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ అనుమతి లేని లోన్ యాప్ లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం గురువారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. లోన్ యాప్ వేధింపులతో రాజమండ్రిలో సూసైడ్ చేసుకున్న దుర్గారావు, లక్ష్మి దంపతుల ఇద్దరు పిల్లలకు రూ.5 లక్షల చొప్పున రూ.10 లక్షల పరిహారం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa