శ్రీకాకుళం: నరసన్నపేట మండలంలోని చెన్నాపురం సచివాలయం పరిధిలో గురువారం గడపగడపకూ మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నరసన్నపేట ఎమ్మెల్యే కృష్ణదాస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎంపీపీ ఆరంగి మురళి, మాజీ జెడ్పీటీసీ చింతు రామారావు గురువారం ఉదయం తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. మండలంలోని అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని కోరారు.