బెల్లంలో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలతో పాటు బి కాంప్లెక్స్, సి, బి2, ఈ లాంటి విటమిన్లు ఉంటాయి. అజీర్తి, మలబద్దకం, నెలసరిలో చిక్కులు, రక్తహీనత లాంటి సమస్యలకు బెల్లం చెక్ పెడుతుంది. రోజూ కొంచెం బెల్లం తింటే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరానికి శక్తి లభిస్తుంది. బెల్లం, సొంపు కలిపి తింటే నోటి దుర్వాసన పోతుంది. బెల్లం, నువ్వులు కలిపి తింటే దగ్గు, జలుబు తగ్గిపోతాయి.