కర్ణాటకలోని శివమొగ్గ నగరంలోని ప్రియాంక లేఔట్ లో మంజుల, దినేష్ అనే భార్యభర్తలు నివసిస్తున్నారు. వారిద్దరి మధ్య మంగళవారం రాత్రి గొడవ జరిగింది. బుధవారం ఉదయం వంటగదిలో ఉన్న మంజులను దినేష్ కత్తితో గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత అతను ఆత్మహత్యాయత్నం చేయగా ఇతరులు గమనించి ఆస్పత్రికి తరలించారు. భార్యభర్తలు బాగానే ఉంటారని, ఎందుకు ఇలా జరిగిందోనని అంతా ఆశ్చర్యపోతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.