చిత్తూరు: యస్ ఆర్ పురం మండలం, పుల్లూరు సచివాలయం పరిధిలో శుక్రవారం ఉదయం 7: 30 గంటలకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉపముఖ్య మంత్రి కె. నారయణస్వామి పాల్గొం టారని డిప్యూటీ సీఎం కార్యాలయం నుండి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని వైఎస్సార్ సీపీ నాయకులు, మండల అధ్యక్షులు, జెడ్పీటీసీ, సింగిల్ విండో అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు పాల్గొనాలని పాల్గొనేవారు కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు.