పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర, ఒడిశా వైపు పయనిస్తోంది. ఈ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా రానున్న 36 గంటల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఆ సమయంలో 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, యానాంలలో భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa