కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా సంతేకల్లూర్ ప్రాథమిక పాఠశాలలో అమానుష ఘటన జరిగింది. 2వ తరగతి చదివే అఖిత్ (7) యూనిఫాంలో మల విసర్జన చేశాడు. ఇది చూసిన టీచర్ హులిగెప్ప దారుణంగా ప్రవర్తించాడు. సలసలా కాగిన వేడి నీళ్లు పోయడంతో ఆ బాలుడు విలవిల్లాడిపోయాడు. 40 శాతం శరీరం కాలిపోవడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. టీచర్ హులిగెప్ప బెదిరింపులతో బాలుడి పేరెంట్స్ పోలీసు కేసు పెట్టలేదని సమాచారం.