ఆగస్టులో స్టాక్ మార్కెట్లు కాస్త రికవరీ అయ్యాయి. అయితే విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ భారతీయ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించడంతో దేశీయ ఇన్వెస్టర్లలో విశ్వాసం సడలుతోంది. ఆగస్టు నెలలో ఇది స్పష్టంగా కనిపించింది. ఆ నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి.
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి 10 నెలల కనిష్ఠానికి చేరిందని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా తెలిపింది. జూలైలో మొత్తం పెట్టుబడి రూ.8,898 కోట్లుగా ఉండగా జూన్ 2022లో రూ.15,497 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆగస్టులో 21.13 లక్షల కొత్త SIP ఖాతాలు నమోదయ్యాయి. సిప్ ఖాతాలు పెరిగినా గత నాలుగు నెలలుగా పెట్టుబడులు తగ్గుతోన్నాయి.
AUM మ్యూచువల్ ఫండ్ల ఆస్తులు 6.39 లక్షల కోట్లకు చేరుకుంది. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులలో రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యం 50 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఆగస్టు చివరి నాటికి మ్యూచువల్ ఫండ్స్‌లో మొత్తం ఫోలియోల సంఖ్య 26 శాతం పెరిగి 13.64 కోట్లకు చేరుకుంది. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తి కూడా రూ.39.33 లక్షల కోట్లకు చేరుకుంది.