తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో భారీ సంఖ్యలో తిరుమలకు భక్తులు చేరుకుంటున్నారు. దీంతో కొండపై అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆ తర్వాత రాంభగీచ వరకు కూడా క్యూలైన్లో భక్తులు నిలబడి ఉన్నారు. శ్రీవారిని దర్శంచుకోవడానికి 24 గంటలు పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శుక్రవారం స్వామివారిని 64,292 మంది భక్తులు దర్శించుకున్నారు.