శనివారం గుంటూరు లోని ఎమ్మెల్యే శ్రీదేవి కార్యాలయంలో వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని. గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిస్థితులను స్థానిక ఏఎన్ఎంలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని. గ్రామాల్లో సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల వైద్యాధికారులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.