ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొడాలి నాని భాషను అందరూ అసహ్యించుకుంటున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 10, 2022, 04:14 PM

కృష్ణా: ఆటోనగర్ లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ కార్యదర్శి కొత్త నాగేంద్ర కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొడాలి నానిది నోరా? మున్సిపాలిటీ కాలువా అనేది రాష్ట్ర ప్రజలకు అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. గుడివాడలో కొడాలి అర్జునరావు అంటే మంచి పేరున్న వ్యక్తి అని, అటువంటి వారి కడుపున పుట్టిన నీచుడు కొడాలి నాని అని విమర్శించారు. కొడాలి నాని వాఖ్యలపట్ల సభ్య సమాజం అసహించుకుంటా వుందన్నారు. కొడాలి నాని కన్నా ఎక్కువ బూతులు తాము మాట్లాడగలమని, కానీ తెలుగు దేశం పార్టీ తమకు సభ్యతా సంస్కారం నేర్పిందన్నారు. 


కొడాలి నాని లాంటి దౌర్భాగ్యుడ్ని, ఒక దుర్మార్గుడ్ని రాష్ట్ర ప్రజలకు రాజకీయంగా అందించిన తెలుగుదేశం పార్టీ తరపున క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సభ్యతా సంస్కారాలతో మాట్లాడిన నాని, ఒక సభ్యత లేని పార్టీ, ఒక అబద్ధాల సౌధంతో కట్టిన పార్టీలో వెళ్లిన నాని మాటలు చూస్తుంటే ఏ గూటి పక్షి ఆ మాటే మాట్లాడుతుంద నే విధంగా కనిపిస్తుందన్నారు. చంద్రబాబుని విమర్శించే స్థాయి కొడాలి నాని కి లేదన్నారు. కొడాలి నాని మాటలను అదుపు చేసుకోకపోత తరిమి తరిమి కొట్టే రోజులు ముందుంటాయని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com