ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి మేరుగ నాగార్జున పై టీడీపీ నేత ఫైర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 10, 2022, 04:17 PM

మొగల్ రాజ్ పురంలో కల కేశినేని శివనాథ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ టీడీపీ ఫ్లోర్ లీడర్ కొటేటి హనుమంతరావు నేరుగా నాగార్జున పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నారా చంద్రబాబు నాయుడు ను, ఆయన తనయుడు నారా లోకేష్ ని అమర్యాదగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. జగన్ మోహన్ రెడ్డి రాక్షస పాలనలో ఎస్సి లు సంతోషంగా ఉన్నారని చెబుతున్న మేరుగా నాగార్జున కు , ఎస్సి ల మీద జరుగుతున్న దాడుల పై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే మంత్రి పదవి తీసేస్తారని భయంతో నోరు మెదపడం లేదని విమర్శించారు. 


ఏపీలో ఎస్సి ల పై జరుగుతున్న దాడుల ను జాతీయ ఎస్సి కమిషన్ గుర్తించి ప్రశ్నిస్తే వారిని కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మేరుగ నాగార్జున మంత్రి అనర్హులని అన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యం రాష్ట్రంలో అమలవుతుందని, మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు జరుగుతున్న విషయం ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇన్ని జరుగుతున్నా మంత్రిగా ఉండి SCలను అవమానించే విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గంగా నదిలో కలిపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com