జల జీవన మిషిన్ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆముదాలవలస మండలంలో పలు అభివృద్ధి పనులకు స్పీకర్ తమ్మినేని శంకుస్థాపన చేశారు. తొగరాం పంచాయతీకి సంబంధించి 2 కోట్ల 58 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు నేడు స్పీకర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. తొగరం గ్రామంలో సుమారు 54 లక్షల నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కొళాయి సుమారు కోటి రెండు లక్షల నిధులతో మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అదనపు భవనాలకు శంకుస్థాపన చేశారు.
ఇస్కలపేట గ్రామంలో సుమారు 38 లక్షల నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ మంచినీటి కొళాయి, సుమారు 16 లక్షలు నిధులతో అంగన్వాడి భవనం మరియు నాడు నేడు ద్వారా పాఠశాల అధునాతనంగా చేయడానికి 12 లక్షల రూపాయలు పనులకు నేడు స్పీకర్ చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టారు. ఇసుకలపేట గ్రామంలో జగనన్న కాలనీలో సుమారు 36 లక్షల నిధులతో 20 ఇళ్లను నిర్మించారు. సుందరంగా సకల సౌకర్యాలతో నిర్మించిన ఆ కాలనీని స్పీకర్ తమ్మినేని సీతారాం నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య వైద్యం సేద్యం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఆయన అన్నారు. నాడు నేడు ద్వారా విద్యాలయాలు అందంగా రూపుదిద్దు కుంటున్నారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యా విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు.
ఈ నియోజకవర్గంలో నదుల మధ్య ఉన్నప్పటికీ త్రాగునీరు సాగునీరుకి ఇబ్బంది పడుతున్నామన్నారు. ఈ సమస్య అదిమించడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, గ్రామ ప్రథమ పౌరురాలు తమ్మినేని వాణి సీతారాం, రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, ఎంపీపీ తమ్మినేని శారదమ్మ, జడ్పిటిసి బెండి గోవిందరావు, సరుబుజ్జిలి ఎంపీపీ కే వి జి సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు తమ్మినేని శ్రీరామ్మూర్తి, పిఎస్ఈఎస్ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీలు మానుకొండ వెంకటరమణ, జగన్నాధ రావు, డిసిసిబి డైరెక్టర్ బొడ్డేపల్లి నారాయణరావు, వైయస్సార్ పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు హౌసింగ్ పీడీ గణపతి, గ్రామీణ వీటిపారుదల శాఖ ఎస్ఈ పి శ్రీనివాస ప్రసాద్, ఈ ఈ బెన్హర్, డి ఈ పి పి సూర్యనారా యణ, ఏ పి సి ఎస్ ఎస్ ఏ రోనంకి జై ప్రకాష్ తదితర అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.