భారీ వర్షానికి ఉత్తరఖండ్‌లో వరద ఉధృతి పొటెత్తుతోంది. దీంతో వరదలకు నది తీరం కోతకు గురైంది. తీరానికి అంచులో ఉన్న ఒక బిల్డింగ్ కళ్లముందే కూలిపోగా ఖోటిల గ్రామంలో 50కిపైగా ఇండ్లు నీట మునిగాయి. కాలి నది ఉధృతంగా ప్రవహించడంతోపాటు ప్రమాదకర స్థితికి చేరడం వల్ల ఈ దారుణ దుస్థితి నెలకొంది. అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.