నంద్యాల జిల్లా పాణ్యంలో ఓ వైసీపీ నేత బరితెగించిన విధానం అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే, పాణ్యంలోని ఇందిరా నగర్ లో చెంచు గిరిజన విద్యార్థుల కోసం ప్రభుత్వం 2013లో 5.30 లక్షలతో పాఠశాలను నిర్మించింది. విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉందనే కారణంతో దాన్ని మూసేశారు. ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థులను వేరే స్కూల్ కు తరలించారు. ఆ స్కూలను స్థానిక వైసీపీ నేత ఒకరు ఆక్రమించుకున్నారు. అంతేకాక, తాను అందులో నివసించేందుకు వీలుగా బిల్డింగ్ లో మార్పులు కూడా చేయించుకున్నారు.