గుంటూరు నగరంలో శనివారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం ప్రారంభమైంది. ఒక్కసారిగా వర్షం రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారు. ఈ వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నగర పాలక సంస్థ అధికారులు వర్షపు నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు.