వైసిపి నేతల తీరుపై టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యంగ్యంగా స్పందించారు. ఇది ఇలా ఉంటే నంద్యాల జిల్లా పాణ్యంలో మూతపడిన ఓ ప్రభుత్వ పాఠశాలను స్థానిక వైసీపీ నేత ఒకరు ఆక్రమించుకుని, దాన్ని నివాసంగా మార్చుకున్న సంగతి తెలిసిందే. దీనిపై స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, దీనికి సంబంధించిన వార్తలు మీడియాలో రావడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇదిగిదిగో.. వైసీపీ ప్రభుత్వ నాడు - నేడు అంటూ ఎద్దేవా చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa