చిత్తూరు: చంద్రగిరి మండలంలో శనివారం వేర్వేరు సమస్యలతో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం లింగేశ్వర్ నగర్ కు చెందిన అన్బు (31) కుటుంబ కలహాలతో శనివారం విషం తాగాడు. కుటుంబ సభ్యులు తిరుపతి రుయాకు తరలించగా అర్ధరాత్రి మృతిచెందాడు. అదేవిధంగా వేదాంతపురానికి చెందిన పురుషోత్తం (30) తిరుపతి మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అతను శనివారం ఇంట్లో ఫ్యాను కు ఉరేసుకుని తనువు చాలించాడు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.