చిత్తూరు: చంద్రగిరి మండలంలోని నడింపల్లిలో శనివారం షణ్ముగం భార్య గౌతమి కడుపునొప్పి తాళలేక ఆత్మ హత్యకు యత్నించింది. ఆమెను కుటుంబ సభ్యులు తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా మండలంలోని యల్లంపల్లిలో శనివారం రాత్రి మురళి మద్యం మత్తులో మద్యం అనుకుని పాడి ఆవులకు వినియోగించే మందులు సేవించాడు. అతన్ని కుటుంబ సభ్యులు తిరుపతి రుయాకు తరలించారు.