రాహుల్ గాంధీ పై అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేసారు. రాహుల్ గాంధీ పాదయాత్ర చేయడానికి ముందు దేశ చరిత్రను అధ్యయనం చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. విదేశీ బ్రాండ్ టీషర్ట్ ధరించి.. భారత్ జోడో యాత్రకు వెళ్లారని ఆరోపించారు. గతంలో పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ప్రసంగాన్ని గుర్తుచేస్తూ.. భారత్ ను అసలు ఒక దేశమే కాదని రాహుల్ వ్యాఖ్యానించారన్నారు. ఈ విషయాన్ని ఆయన ఏ పుస్తకంలో చదివారని ప్రశ్నించారు.