టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. "ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూసి ఓర్వలేక చంద్రబాబు బూతులు తిడుతున్నారు. రాజకీయంగా చంద్రబాబు దిగజారి పోయారు. చంద్రబాబు చేసే కుయుక్తులు, మోసాలు, కుట్రలను అన్నీ జనం గమనిస్తూనే ఉన్నారు. దుష్టచతుష్టయాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు రెచ్చిపోతున్నారు" అని మేరుగ నాగార్జున దుయ్యబట్టారు.