కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తెలంగాణ సీఎం కేసీఆర్ తో ప్రగతిభవన్ లో ఆదివారం భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం తాజా రాజకీయ పరిస్థితులు, దేశంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర, కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై నేతలిద్దరూ చర్చిస్తున్నట్లు తెలిసింది.