ప్రముఖ సీనియర్ నటులు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. తన విలక్షణమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం ఎంతో బాధ కలిగించిందని చంద్రబాబు అన్నారు. కేవలం నటుడిగానే కాకుండా కేంద్రం మంత్రిగా కృష్ణం చేసిన సేవలను చంద్రబాబు గుర్తు చేసారు. కృష్ణం రాజు కుటుంబానికి చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు