యూపీలోని లఖింపుర్ ఖేరి జిల్లా మహ్మదీ ప్రాంతం సమీపంలోని గ్రామంలో దారుణం జరిగింది. శనివారం రాత్రి బహిర్భూమికి వెళ్లిన 15 ఏళ్ల బాలికను ఐదుగురు దుండగులు ఎత్తుకెళ్లారు. ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదుగురు నిందితులను ఆదివారం అరెస్ట్ చేశారు