ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి (99) కన్నుమూశారు. మధ్యప్రదేశ్‌లోని నార్సింగ్‌పూర్‌లో ఆదివారం ఆయన తుది శ్వాస విడిచారు. 1982లో ద్వారక శంకరాచార్య బిరుదును ఆయన వారసత్వంగా పొందారు. ఇక 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని, స్వాతంత్ర్య సమర యోధుడిగా నిలిచారు. అంతేకాకుండా 'విప్లవ సాధువు'గా పేరు పొందారు. 1950లో 'దండి సన్యాసి' అయ్యారు.