ఈ నెల 12 నుంచి అమరావతి నుంచి అరసవిల్లి వరకు రాజధాని రైతుల మహా పాదయాత్రపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఉత్తరాంధ్రపై పాదయాత్ర అసమర్ధుల అంతిమ యాత్ర అని అన్నారు. ఇది ఉత్తరాంధ్ర రాజధాని యాత్ర అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకే అని విమర్శించారు. అలాంటి యాత్రకు ఎవరు అనుమతి ఇస్తారు? అని తమ్మినేని ప్రశ్నించారు. మూడు రాజధానులతో రాష్ట్రమంతా అభివృద్ధి జరుగుతుంది అని అయన తెలిపారు.